భద్రాద్రిలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీలు

భద్రాద్రిలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీలు

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని పంచాయతీ ఆఫీసులో ఐటీడీఏ పీవో ప్రతీక్ ​జైన్​శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈవో శ్రీనివాసరావుతో కలిసి రికార్డులు పరిశీలించారు. తడి, పొడి చెత్తలను వేరు చేసి సేకరించేలా సిబ్బందికి సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

పంచాయతీ ఆఫీసు ఎదురుగా షాపింగ్​ కాంప్లెక్స్, వైకుంఠ ధామం,  యూబీ రోడ్డులోని ఖాళీ స్థలాలను చూశారు. టౌన్​లో శానిటేషన్​ను భద్రాచలం వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని చేయాలన్నారు.