గిరిజన మహిళలు జీవనోపాధి పొందాలి : ఐటీడీఏ పీవో రాహుల్

గిరిజన మహిళలు జీవనోపాధి పొందాలి : ఐటీడీఏ పీవో రాహుల్

భద్రాచలం, వెలుగు :  దళారులను దరి చేరనీయకుండా ఆదివాసీ గిరిజన మహిళా సొసైటీ సభ్యులే ఇసుక ర్యాంపులను నిర్వహించుకుని జీవనోపాధి పొందాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్​ ఆకాంక్షించారు. చర్ల మండలంలోని గొమ్ముగూడెం ఇసుక ర్యాంపులో పైలట్​ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి వారికి జేసీబీని ఇచ్చి ఆయన శుక్రవారం ప్రారంభించారు. 

సొసైటీ సభ్యులే బాధ్యతలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు, బినామీలను నమ్మి మోసపోవద్దని సూచించారు.  గోదావరిలో ఇసుక తీత, నిర్వహణ, విక్రయం అన్నీ  నిర్వహించుకోవాలని చెప్పారు. ప్రతీదీ రిజిస్టర్​లో నమోదు చేయాలన్నారు. సొంతంగా నిర్వహించుకునే గిరిజన మహిళా సొసైటీలకు ఐటీడీఏ ద్వారా సాంకేతిక, ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో పీసా స్పెషల్ ఆఫీసర్​ అశోక్​కుమార్, టీజీఎండీసీ పీవో శంకర్​నాయక్, ఏడీ మైన్స్ దినేశ్​కుమార్​ పాల్గొన్నారు.