నాగోబా జాతర ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలి : ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్

నాగోబా జాతర ఏర్పాట్లు గడువులోగా పూర్తి చేయాలి : ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్
  • ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ 

ఇంద్రవెల్లి, వెలుగు : ఈ నెల 18న మెస్రం వంశీయులు మహాపూజలతో ప్రారంభకానున్న నాగోబా జాతర ఏర్పాట్లను గడువులోగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్ లోని నాగోబా ఆలయాన్ని ఆయన సందర్శించి జాతర ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెస్రం వంశీయులతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు. 

గతేడాది దర్బార్ సమావేశంలో వచ్చిన దరఖాస్తులతోపాటు డిప్యూటీ భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రజలు విన్నవించిన సమస్యలు, లబ్దిదారుల వివరాల నివేదిక అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆయన వెంట కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం తుకారాం, డీఆర్డీవో రవీందర్ రాథోడ్, ఐటీడీఏ డీడీ జాదవ్ అంబాజీ, ఆర్డీబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రావణ్ కుమార్, ఈఈ చంద్రమోహన్, ఏఈ భానుకుమార్, ఈజీఎస్ ఏపీవో జాదవ్ శ్రీనివాస్, టీఏ విఠల్ తదితరులు ఉన్నారు.