ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ హానెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ హానెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా

అల్లరి నరేష్, ఆనంది జంటగా ఎ.ఆర్.మోహన్ దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. శుక్రవారం సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన  ప్రీ రిలీజ్ ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నరేష్​ మాట్లాడుతూ ‘ఇదొక హానెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమా. మన చుట్టూ జరిగే కథ. గిరిజన గ్రామాల్లోని ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారనే రియల్ స్టోరీ ఆధారంగా దీన్ని రూపొందించాం. ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పుట్ చూశాక చాలా కాన్ఫిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నాం. థియేటర్ నుంచి బయటికి వస్తూ శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ గురించి, అబ్బూరి రవి డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు. కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం’ అన్నాడు.

‘మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు అందరికీ అవగాహన కల్పించే విధంగా ఉంటుంది. కనక లక్ష్మి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్’ అని చెప్పింది ఆనంది. దర్శకుడు మాట్లాడుతూ ‘లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్. ఇందులో మేం చూపించిన విధంగా ఇంకా చాలామంది బతుకుతున్నారు. వాళ్ల జీవితాన్నే స్ర్కీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చూపిస్తున్నాం. ఇదంతా మేం చేసిన టీమ్ వర్క్. మంచి కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో వస్తోన్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. డిస్ట్రిబ్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కెరీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టార్ట్ చేసి, ఇంత మంచి కథతో నిర్మాతగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది అన్నారు నిర్మాత రాజేష్ దండా.  షానీ, కొమురం, శ్రీ తేజ్, చోటా కె ప్రసాద్, అబ్బూరి రవి, శ్రీ చరణ్ పాకాల పాల్గొన్నారు.