
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-–26కి సంబంధించి ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ఐటీఆర్) దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం తెలిపింది. పెనాల్టీ లేకుండా ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15 అని తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ దాఖలు, పన్ను చెల్లింపు ఇతర సంబంధిత సేవలలో సహాయం చేయడానికి, తమ హెల్ప్‌డెస్క్ 24 గంటలు పనిచేస్తుందని, కాల్స్, లైవ్ చాట్‌లు, వెబ్‌ఎక్స్ సెషన్‌లు, ట్విట్టర్/ఎక్స్ ద్వారా సహాయం అందిస్తున్నామని తెలిపింది.
అసెస్మెంట్ఇయర్(ఏవై) 2025–-26కి ఐటీఆర్ దాఖలు చేయని పన్ను చెల్లింపుదారులు వీలైనంత త్వరగా చేయాలని కోరింది. ఖాతాలను ఆడిట్ చేయాల్సిన అవసరం లేని వ్యక్తులు, హెచ్‌యూఎఫ్‌లు. ఐటీఆర్‌లు దాఖలు చేయడానికి గడువు తేదీని జూలై 31 నుంచి సెప్టెంబర్ 15కు పొడిగించామని ఐటీశాఖ తెలిపింది.