ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్‌సెప్టెంబర్ 15

ఐటీఆర్ ఫైలింగ్ డెడ్‌లైన్‌సెప్టెంబర్ 15
  • జులై 31 నుంచి పొడిగించిన ట్యాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ టాక్స్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ మంగళవారం అసెస్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇయర్ (ఏవై) 2025–-26 (ఆర్థిక సంవత్సరం 2024–25  కోసం ఐటీఆర్ (ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ టాక్స్ రిటర్న్స్) ఫైల్ చేయడానికి గడువును జులై 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. కాగా, వ్యక్తులు లేదా ఎంటిటీలు, వాళ్ల అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన అవసరం లేనివాళ్లు, సాధారణంగా జులై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాలి.  

‘‘నోటిఫై చేసిన ఐటీఆర్‌‌‌‌‌‌‌‌లలో చాలా మార్పులు చేశాం.  అలాగే ఏవై 2025–-26 కోసం సిస్టమ్‌‌‌‌‌‌‌‌ను రెడీ చేయడానికి సమయం పడుతుంది కాబట్టి, రిటర్న్స్ ఫైల్ చేయడానికి గడువును పొడిగించాం” అని  ట్యాక్స్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌  (సీబీడీటీ) పేర్కొంది.