‘సారీ బ్రదర్ దీన్నే కర్మ అంటారు’..అక్తర్కు షమీ అదిరే రిప్లై

‘సారీ బ్రదర్ దీన్నే కర్మ అంటారు’..అక్తర్కు షమీ అదిరే రిప్లై

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్కు టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఓడిపోయింది. ఈ ఓటమిపై అక్తర్ గుండె పగిలే ఏమోజీని షేర్ చేశాడు. ఈ ట్వీట్ను రీ ట్వీట్ చేసిన మహమ్మద్ షమీ..‘‘దీన్నే కర్మ అంటారు బ్రదర్’’ అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. 

నెదర్లాండ్స్ పుణ్యమా అని సెమీఫైనల్‌కు వచ్చిన పాక్.. న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. దీంతో ఆ జట్టు టైటిల్ గెలిచినంత హడావుడి చేసింది. ఆ దేశ ప్రధానితో పాటు మాజీ ఆటగాళ్లు భారత వైఫల్యాన్ని హేళన చేశారు. ముఖ్యంగా టీమిండియా బౌలర్లను చేతకాని వారని విమర్శించారు. అక్తర్ అయితే భారత బౌలింగ్ యూనిట్‌‌ను పాకిస్థాన్ బౌలర్లతో పోల్చుతూ  విమర్శలు గుప్పించాడు.

విశ్వవిజేతగా ఇంగ్లాండ్

టీ20 వరల్డ్ కప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ అవతరించింది. ఫైనల్లో పాక్పై 5 వికెట్ల తేడాతో గెలిచి పొట్టి ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిచింది. హోరా హోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లాండ్ 138 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలో ఛేదించి రెండో సారి టీ20 వరల్డ్ కప్ టైటిల్ను ముద్దాడింది. 138 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 7 పరుగుల వద్ద అలెక్స్ హేల్స్ షాహీన్ అఫ్రిదీకి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన సాల్ట్ 10 పరుగులు చేసి రవూఫ్ బౌలింగ్లో పెవీలియన్ చేరాడు. 

దీంతో ఇంగ్లాండ్ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. కొద్దిసేపటికే కెప్టెన్ బట్లర్ కూడా ఔటయ్యాడు. 17 బంతుల్లోనే 26 పరుగులు చేసి మాంచి టచ్లో ఉన్నట్లు కనిపించిన బట్లర్ను రవూఫ్ బుట్టలో వేసుకోవడంతో..ఇంగ్లాండ్ 45 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.