రజినీ 'జైలర్' ఫస్ట్ సింగిల్..అద్దిరిపోయే మాస్ స్టెప్స్ తో తమన్నా

రజినీ 'జైలర్' ఫస్ట్ సింగిల్..అద్దిరిపోయే మాస్ స్టెప్స్ తో తమన్నా

రజినీకాంత్ (Rajinikanth) స్టైల్, స్టామినా పూర్తీ డిఫరెంట్. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar)  డైరెక్షన్ లో వస్తున్న మూవీ 'జైలర్'. రజినీకు జోడీగా తమన్నా(Tamannaah)  నటిస్తోంది. 

తాజాగా ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్  ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. తమన్నా హాట్ లుక్స్ తో వేసే స్టెప్స్ కుర్రకారును ఫిదా చేస్తుంది. అనిరుధ్ మ్యూజిక్ అందించిన 'వా నువ్వు కావాలాయ్య'  సాంగ్  బీట్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ క్రీయేట్ చేస్తుందో చూడాలి

రజినీ కాంత్ నుంచి వచ్చే ప్రతి మాస్ సాంగ్ లో తనదైన మాస్ స్టైల్ లో స్టెప్పులు వేస్తారు. మేనరిజంను చూపించడంలో రజినీ స్టైలే వేరు. ఈ మధ్య తమన్నా నుంచి వచ్చిన సినిమాల్లో ఎక్కువగా బోల్డ్ కంటెంట్స్ సీన్స్ లో నటించడంతో.. యూనిట్ తమన్నాపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్ కనుక మెప్పిస్తే  థియేటర్లో ఆడియన్స్ డ్యాన్స్ వేయడం ఖాయమే.

ఈ మూవీలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్(Shivarajkumar), మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్(Mohanlal)  ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే  రమ్యకృష్ణ(Ramya Krishna), సునీల్(Sunil), జాకీ ష్రాఫ్(Jackie Shroff), యోగిబాబు(Yogi Babu) తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కళానిధి మారన్ ఈ మూవీను నిర్మిస్తున్నారు. ఆగస్టు 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.