
న్యూఢిల్లీ: ట్రావెల్ టెక్ కంపెనీ ఇక్సిగో, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ప్రోసస్ నుంచి రూ.1,296 కోట్లు సమీకరించనుంది. ప్రిఫరెన్షియల్ షేర్ల ఇష్యూ ద్వారా ఈ డీల్ జరుగుతుంది. ఇక్సిగో తన 10.1శాతం వాటాను ఎంఐహెచ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వన్ బీవీ (ప్రోసస్)కు రూ.280 షేర్ ధర వద్ద విక్రయించనుంది.
ఈ నిధులను కంపెనీ ఆర్గానిక్, ఇనార్గానిక్ వృద్ధి, వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాల కోసం వినియోగిస్తామని ఇక్సిగో పేర్కొంది. ఈ కంపెనీ 2024 జూన్‌లో రూ.93 షేర్ ధరతో మార్కెట్‌లో లిస్టయ్యింది.
ప్రోసస్ ఇప్పటివరకు 8.6 బిలియన్ డాలర్లను ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది. ఈ-–కామర్స్, ఫుడ్ డెలివరీ, ట్రావెల్, ఫిన్‌టెక్ రంగాల్లో పెట్టుబడి పెట్టింది.