
చేర్యాల, వెలుగు : చేర్యాలను డివిజన్‌గా ప్రకటించాలని 25న బంద్ను నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జేఏసీ ఆఫీసులో బంద్ కు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల ముందు జనగామలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారని, ఆ మాటను నిలబెట్టుకోవాలన్నారు. డిసెంబర్ లోపు రెవెన్యూ డివిజన్ ను ప్రకటించాలన్న డిమాండ్‌తో బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుల సంఘాలు, యువజన సంఘాలు, అన్ని పార్టీల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు అశోక్, బీరయ్య, సత్యనారాయణ, ప్రసాద్, భూమయ్య, యాదగిరి, నర్సింహ చారి, మమత, వెంకటాద్రి, సుధాకర్, కనకయ్య, శ్రీనివాస్ రెడ్డి, భద్రయ్య, శ్రీనివాస్, నర్సిరెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.