రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యం : జేఏసీ చైర్మన్ పరమేశ్వర్

రెవెన్యూ డివిజన్ సాధనే లక్ష్యం : జేఏసీ చైర్మన్ పరమేశ్వర్

చేర్యాల, వెలుగు: రెవెన్యూ డివిజన్​సాధనే లక్ష్యంగా జేఏసీ ముందుకెళ్తుందని కమిటీ చైర్మన్​పరమేశ్వర్​ అన్నారు. గురువారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్​విద్యా సంస్థలను కలిసి కరపత్రాలను అందజేసి 12న జరిగే బంద్​కు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పరమేశ్వర్​మాట్లాడుతూ.. బంద్ కు అందరూ సహకరించి రెవెన్యూ డివిజన్ ఉద్యమానికి ఊపిరి అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట జేఏసీ నాయకులు ఉన్నారు. 

బీఆర్ఎస్​ జేఏసీ ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ..

చేర్యాల రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ బీఆర్ఎస్​ జేఏసీ చైర్మన్​ నర్సయ్య పంతులు ఆధ్వర్యంలో ధూల్మిట్ట మండలంలోని గ్రామాల్లో బైక్​ ర్యాలీ నిర్వహించారు. ముందుగా వీర బైరాన్​పల్లి గ్రామంలోని అమరవీరుల బురుజు వద్ద నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభించింది. అనంతరం ధూల్మిట్ట తహసీల్దార్​కు మెమోరాండం సమర్పించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.