చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి : జేఏసీ నాయకులు

చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలి :  జేఏసీ నాయకులు

చేర్యాల, వెలుగు : సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం చేర్యాలను రెవెన్యూ డివిజన్​చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్​చేశారు. బుధవారం చేర్యాల మండల కేంద్రంలో చేర్యాల, ధూల్మిట్ట, మద్దూర్, కొమురవెల్లి  అఖిల పక్ష జేఏసీ నాయకులు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం చేపట్టి ర్యాలీ తీశారు. జేఏసీ చైర్మన్ నర్సయ్య పంతులు మాట్లాడుతూ... కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేయకపోవడం శోచ‌నీయ‌మ‌న్నారు.

 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో చేర్యాలను రెవెన్యూ డివిజన్​చేస్తానని సీఎం జనగామ బహిరంగ సభలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు బాల్ నర్సయ్య, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి, సురేశ్ గౌడ్, నారాయణరెడ్డి, రాజేందర్, శ్రీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ కరుణాకర్, తలారి కీర్తన -కిషన్,  సిద్ధప్ప, నాగేశ్వర్ రావు, సత్తిరెడ్డి, సంజీవులు, నాగరాజు, తిరుపతి రెడ్డి, వెంకట్ మావో, పద్మ- వెంకట్ గౌడ్ పాల్గొన్నారు.