తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు..వాళ్లకు నల్లా, కరెంటు కనెక్షన్లు కట్ చేయండి : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు..వాళ్లకు నల్లా, కరెంటు కనెక్షన్లు కట్ చేయండి : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి
  • వాళ్లే పోయి బాబు కాళ్లు పట్టుకొని బనకచర్లను బంద్​ చేయిస్తరు :జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​ రెడ్డి

మహబూబ్​నగర్​, వెలుగు: తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోవర్టులు ఉన్నారని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబ్ నగర్​ జిల్లా బాలానగర్​ మండలం మోతి ఘన్​పూర్​లో రూ.50 లక్షల ముడా నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్  గ్రౌండ్  డ్రైనేజీ నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రభుత్వానికి నేను ఒక ఎమ్మెల్యేగా సూచన చేస్తున్న.

బనకచర్లను ఆపాలని మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి లెటర్లు రాస్తున్నారు. రాయాల్సింది లెటర్లు కాదు. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు కోవర్టులు ఉన్నారు. ఇరిగేషన్​ ప్రాజక్టులు, రోడ్డు కాంట్రాక్టులు, హైదరాబాద్​లో దందాలన్నీ వారివే. ఆ కోవర్టులకు నల్లా, కరెంటు కనెక్షన్లు కట్​ చేయండి. ఇరిగేషన్​ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి ఇవ్వకండి. అప్పుడు వాళ్లే పోయి బాబు కాళ్లు పట్టుకుంటారు. బనకచర్లను బంద్​ చేయిస్తరు. మనం మంచిగా మాట్లాడితే.. ఆ ఆంధ్రావాళ్లు మన మాట వినరు. ఈ పని చేస్తేనే బనకచర్ల బంద్​ అవుతుంది' అని అన్నారు.