SK vs KKR: ధోనీ ఇలా కూడా చేస్తాడా.. చెన్నై ఫ్యాన్స్‌ను ఆటపట్టించిన మిస్టర్ కూల్

SK vs KKR: ధోనీ ఇలా కూడా చేస్తాడా.. చెన్నై ఫ్యాన్స్‌ను ఆటపట్టించిన మిస్టర్ కూల్

ఐపీఎల్ లో నిన్న (ఏప్రిల్ 8) ఎట్టకేలకు అభిమానులకు తమ ఫేవరేట్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీని చూసుకునే భాగ్యం కలిగింది. కేకేఆర్ తో జరిగిన ఈ మ్యాచ్ లో ధోనీ బ్యాటింగ్ కు వచ్చి అభిమానులకు ఖుషీ చేశాడు. సాధారణంగా 8 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే ధోనీ ఐదో స్థానములోనే దిగి గ్రౌండ్ లో ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశాడు. అయితే తాను బ్యాటింగ్ కు రావడం వెనుక కొంత డ్రామా జరిగింది. జడేజాతో కలిసి చెన్నై ఫ్యాన్స్ ను సరదాగా ఆటపట్టించాడు. 

స్వల్ప లక్ష్య ఛేదనలో చెన్నై విజయం దిశాగా దూసుకెళ్తుంది. 138 పరుగుల లక్ష్య ఛేదనలో మరో మూడు పరుగులు చేయాల్సిన దశలో శివమ్ దూబే ఔటయ్యాడు. దీంతో జడేజా బదులు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ చేయడానికి క్రీజ్ లోకి వచ్చాడు. మాహీ క్రీజ్ లోకి రాకముందు జడేజా ప్యాడ్ లు కట్టుకొని బ్యాటింగ్ చేసేందుకు నాలుగడుగులు పెవిలియన్ నుంచి కదిలాడు. అయితే జడేజా మళ్ళీ వెంటనే వెనక్కి తిరిగి వెళ్లగా.. ధోనీ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇదంతా ధోనీ కావాలని చేసాడని.. మ్యాచ్ అనంతరం పేస్ బౌలర్ తుషార్ దేశ్ పాండే తెలిపాడు. 

"ఇదంతా ధోనీ భాయ్ ఐడియా. బ్యాటింగ్ లో తాను ముందు వెళతానని జడేజాకు చెప్పాడు. అయితే దానికంటే ముందు నువ్వు బ్యాటింగ్ కు వెళ్తున్నట్టు నటించు. అని జడేజాకు ధోనీ చెప్పాడని దేశ్ పాండే వివరించాడు. ధోని బ్యాటింగ్‌కు బయలుదేరిన వెంటనే..  చెన్నై ప్రేక్షకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ధోనీ పేరును జపిస్తూ స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. చప్పట్లు కొడుతూ బిగ్గరగా కేకలు వేశారు. మొత్తం మూడు బంతులు ఎదుర్కొన్న ధోనీ ఒక్క పరుగు చేశాడు. విన్నింగ్ షాట్ కొడతాడని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదరైంది. సింగిల్ తీసి గైక్వాడ్ కు మ్యాచ్ ఫినిషింగ్ కు అవకాశమిచ్చాడు. సోమవారం (ఏప్రిల్ 8) జరిగిన ఈ మ్యాచ్‌‌లో సీఎస్కే 7  వికెట్ల తేడాతో నైట్ రైడర్స్‌‌ను ఓడించింది.