
చందానగర్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పెరగడానికి బీఆర్ఎస్ పాలనే కారణమని శేరిలింగంపల్లి సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ మండిపడ్డారు. నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ స చెలగాటమాడిందన్నారు.
శుక్రవారం మియాపూర్, చందానగర్ డివిజన్లలోని పలు కాలనీల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.