
హైదరాబాద్: హరిహర వీరమల్లు సినిమాను బాయ్ కాట్ చేస్తామని కొందరు బెదిరించారని.. అయినా ఎవరికి బెదరలేదన్నారు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. నా సినిమా మిమ్మల్ని అంత బెదిరించిందా అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా సక్సెస్ మీట్‌ను గురువారం (జూలై 24) హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నా జీవితంలో సక్సెస్ మీట్‌కు హాజరవడం ఇదే తొలిసారని చెప్పారు.
తన సినిమాలను ప్రమోషన్ చేసుకునే అలవాటు లేదన్నారు. హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్లలో గత రెండు రోజుల్లో నేను మాట్లాడిన విషయాలు నా 29 ఏళ్ల సినీ కెరీర్లో10 శాతం కూడా మాట్లాడలేదన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పంచాయితీలు చేసి తన సినిమా విడుదల చేయాల్సి వచ్చిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ALSO READ | HHVM Review : 'హరి హర వీరమల్లు' అభిమానుల అంచనాలను అందుకుందా?
డిప్యూటీ సీఎంని కదా సినిమా సులువుగా విడుదలవుతుందనుకున్నా కానీ.. హరిహర వీరమల్లు సినిమా విడుదల కోసం పంచాయతీలు చేయాల్సి వచ్చిందని.. వారం నుంచి సరిగ్గా నిద్ర కూడా పోలేదని హాట్ కామెంట్స్ చేశారు. తనకు జీవితంలో ఏది తేలిగ్గా దొరకలేదని.. నా జీవితం వడ్డించిన విస్తరి కాదని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మొత్తానికి హరిహర వీరమల్లు సినిమా అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉందన్నారు. హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ 25 నుంచి 30 శాతం పూర్తి అయ్యిందని.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేస్తామని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు పవన్ కల్యాణ్.
కాగా, ఎన్నో అడ్డంకులు, నిరీక్షణను దాటుకుని ఎట్టకేలకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు: పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' మూవీ 2025, జూలై 24న విడుదలైన విషయం తెలిసిందే. అసలు విడుదల కూడా కాదని భావించిన తరుణంలో సినిమాను పూర్తి చేశారు పవన్ కళ్యాణ్. చారిత్రక నేపథ్యంతో అద్భుతమైన సాహస గాథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. చాలా కాలం తర్వాత పవన్ కల్యాన్ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు