
మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగిన ఒక దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి రిసెప్షనిస్ట్‌పై ఒక వ్యక్తి అమానుషంగా దాడి చేయడాన్ని బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ( Janhvi Kapoor ) తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..
కల్యాణ్ ప్రాంతంలోని బాల చికిత్సాలయంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. గోకుల్ ఝా అనే వ్యక్తి తన బిడ్డను డాక్టర్‌కు చూపించడానికి వచ్చాడు. అయితే, క్యూ పద్ధతి పాటించకుండా ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా, రిసెప్షనిస్ట్ అతడిని అడ్డుకొని అపాయింట్‌మెంట్ లేకుండా లైన్‌లో రావాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన గోకుల్ ఝా, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆమెను కాలితో తన్నడమే కాకుండా, జుట్టు పట్టుకొని నేలపై ఈడ్చుకుంటూ వెళ్లాడు. ఈ దారుణ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయ్యాయి.
Half-baked headline:
— ShoneeKapoor (@ShoneeKapoor) July 23, 2025
A receptionist girl beaten up by a Guy in Kalyan MH.
Real uncut footage:
She slapped a family member first.
Half-cut video👇 Extended footage👇 pic.twitter.com/jHfw5JmMbv
జాన్వీ కపూర్ ఆగ్రహం
ఈ ఘటనపై జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ వ్యక్తిని జైల్లో ఉంచాలి. ఇలాంటి ప్రవర్తన సరైందని ఎవరైనా ఎందుకు అనుకుంటారు?. ఇంత దూకుడుగా, నిర్బయంగా వ్యవహరిస్తాడు. అవతలి వ్యక్తిపై ఎలా చేయి ఎత్తగలుగుతారు? మానవత్వం లేకుండా చేసిన ఈ పనిపై కనీసం పశ్చాత్తాపం, అపరాధభావం ఉండదా? ఇది చాలా అవమానకర చర్య. ఇలాంటి ప్రవర్తనను మనం ఎన్నటికీ క్షమించకూడదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని శిక్షించకపోతే అది మనకే సిగ్గుచేటు. ఈ వ్యక్తి జైలుకు వెళ్లాల్సిందే అని ఆమె పోస్ట్ చేసింది.
►ALSO READ | Nithya Menen : తెరపై ప్రేయసి.. నిజ జీవితంలో ఒంటరిగా.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
దాడి అనంతరం అక్కడి నుంచి నిందితుడు గోకుల్ ఝా పరారైయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ దారుణంపై సెలబ్రిటీల స్పందనతో పాటు, నిందితుడికి కఠిన శిక్ష పడాలని ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్నారు.