Nithya Menen : తెరపై ప్రేయసి.. నిజ జీవితంలో ఒంటరిగా.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Nithya Menen :  తెరపై ప్రేయసి.. నిజ జీవితంలో ఒంటరిగా.. పెళ్లిపై నిత్యామీనన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి నిత్యామీనన్.  'అలా మొదలైంది', 'ఇష్క్',  'గుండే జారీ గల్లంతయ్యిందే'  '100 డేస్ ఆఫ్ లవ్' , 'ఓ కదల్ కన్మణి'  వంటి క్లాసిక్ రొమాంటిక్ మూవీలలో  అద్భుతమైన నటనతో  సినీ ప్రియుల మనస్సు దోచేసింది.  వెండితెరపై ఆదర్శ ప్రేయసిగా మెప్పించిన ఈ బెంగళూరు బ్యూటీ .. నిజ జీవితంలో ప్రేమ, పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

పెళ్లి అనేది నా లక్ష్యం కాదు అని తాజా ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది నిత్యా మీనన్. ఎప్పుడూ ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడతాను. నా కోసం నేను సమయం గడపడానికే ఎక్కువగా ఇష్టపడతాను. ఒంటిగా ఉండటానికి ఎప్పుడూ భయపడలేదని చెప్పారు . పెళ్లికి నేను వ్యతిరేకం కాదు.. కానీ దాని కోసం తొందరపడాలని నేను అనుకోవడం లేదని స్పష్టం చేశారు. నేను పెళ్లి చేసుకుంటే  నా తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ వారు నాపై ఎప్పుడూ ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదని స్పష్టం చేశారు. ఇకపై తాను సామాజిక ఒత్తిళ్లకు లోనుకానని తెలిపారు.

►ALSO READ | మంచు విష్ణు మరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రావణుడి కోణం నుంచి 'రామాయణం'.. ఆ స్టార్ హీరోలతో!

 పెళ్లి చేసుకోకపోతే జీవితం అసంపూర్ణం అన్న భావన ఇంకా సమాజంలో బలంగా ఉందని చెప్పారు నిత్యా.  కానీ వివాహం, ప్రేమ లేకుండా కూడా అర్థవంతమైన జీవితాన్ని గడపవచ్చని నొక్కి చెప్పడానికి రతన్ టాటాను ఉదాహరణగా తీసుకున్నారు. ఆయన ఎలాంటి జీవితాన్ని గడిపారో చూడండి.ఆయన ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదని అన్నారు. ప్రేమ వస్తే గొప్ప. రాకపోతే కూడా చాలా బాగుంటుంది.  ఇక ప్రేమ, పెళ్లి గురించి బాధపడను అని ఆమె అన్నారు.  

తెలుగు, తమిళం, మలయాళం ,కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 60కి పైగా  చిత్రాల్లో నటించింది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో తలైవన్ తలైవి, ఇడ్లీ కడాయ్ సినిమాల్లో నటిస్తోంది.