
జగిత్యాల రూరల్, వెలుగు: జగిత్యాల జిల్లా కేంద్రంలోని చల్‌గల్ మామిడి మార్కెట్‌లో నిషేధిత రసాయనాలు వాడుతున్నారన్న సమాచారం మేరకు సోమవారం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అనూష ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో ఇథనిల్ రిపెనర్ అనే నిషేధిత రసాయనం లభ్యం కాగా సీజ్ చేశారు.
రసాయనాలు వాడకుండా మామిడి కాయలను ఎక్స్‌పోర్ట్ చేయాలని కమిషన్ ఏజెంట్లను ఆదేశించారు.