దాదాకు బదులుగా జై షా

దాదాకు బదులుగా జై షా

న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో జరిగే ఐసీసీ బోర్డు మీటింగ్‌‌కు.. బీసీసీఐ తరఫున సెక్రటరీ జై షా హాజరుకానున్నాడు. నిజానికి బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ ఈ మీటింగ్‌‌కు హాజరవ్వాల్సి ఉంది.  కానీ అనారోగ్య కారణాలతో దాదా ఈ మీటింగ్‌‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో  జైషా ఆ బాధ్యత తీసుకున్నాడు. ఇటీవల మైల్డ్‌‌ హార్ట్‌‌ ఎటాక్‌‌కు గురైన గంగూలీ ప్రస్తుతం రికవర్‌‌ అవుతున్నాడు. దాదాకు మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరని డాక్టర్లు సూచించిన నేపథ్యంలో.. జై షా ఐసీసీ బోర్డు మీటింగ్‌‌కు అటెండ్‌‌ అవుతారని బీసీసీఐ ట్రెజరర్‌‌ అరుణ్‌‌ ధుమాల్‌‌ వెల్లడించాడు.  జై షా బోర్డు మీటింగ్‌‌కు అటెండ్‌‌ అవుతున్నందున.. ఇటీవల జరిగిన ఐసీసీ చీఫ్‌‌ ఎగ్జిక్యూటివ్స్‌‌ మీటింగ్‌‌లో బీసీసీఐ తరఫున తాను పాల్గొన్నానని ధుమాల్‌‌ తెలిపాడు. ఐసీసీ మీటింగ్‌‌లో టీ20 వరల్డ్‌‌కప్‌‌పైనే ఎక్కువగా చర్చ జరిగే చాన్స్‌‌ ఉంది. ఇండియాలో జరిగే ఈ టోర్నీ కోసం ఐసీసీ ట్యాక్స్‌‌ ఎంగ్జెంప్షన్‌‌ అడుగుతోంది.

For More News..

నాలుగేళ్లయినా ఎట్టి బతుకులే! నాలుగున్నర ఏళ్లలో రూ.100 పెంచిన్రు

రూ. 40కి కూరగాయలు కొని.. రూ. 500 ఇవ్వడంతో దొరికిన దొంగనోట్లు

డెవలప్​మెంట్ గురించి చెప్పుడే కానీ చేస్తలేరు!