
జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను పురస్కరించుకొని అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్లో ఆదివారం అమెరికన్హిందూ కమ్యూనిటీ ఆధ్వర్యంలో కార్లతో భారీ ర్యాలీ తీశారు. 11 దేవాలయాలను కలుపుతూ జైశ్రీరామ్ నినాదాలతో, భజన పాటలతో 216 కార్లు, 500 బైకులతో 5 కిలోమీటర్ల పొడవున ఈ ర్యాలీ సాగింది. ఎస్కార్ట్గా బైకులపై 8 మంది పోలీసులు కూడా వెళ్లారు. హ్యూస్టన్లోని మీనాక్షి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మొదలైన ర్యాలీ.. ఆరుగంటల పాటు దాదాపు 160 కిలోమీటర్ల మేర సాగి రిచ్‌మండ్‌లోని శరద్ అంబా టెంపుల్ వద్ద మధ్యాహ్నం ముగిసింది. కాగా, ర్యాలీ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన హ్యూస్టన్ వీహెచ్పీ వలంటీర్లు అచలేష్ అమర్, ఉమంగ్ మెహతా, అరుణ్ ముంద్రా మాట్లాడుతూ.. 2,500 మందికి పైగా భక్తులు వివిధ దేవాలయాల వద్ద గుమిగూడి చూపిన భక్తి, ప్రేమ ఎంతో విలువైనదని, శ్రీరాముడు స్వయంగా హ్యూస్టన్ వచ్చినట్లు అనిపించిందని పేర్కొన్నారు.