జైలు నుంచి పార్లమెంట్‌కు.. అమృత్ పాల్ ప్రమాణస్వీకారానికి బెయిల్

జైలు నుంచి పార్లమెంట్‌కు.. అమృత్ పాల్ ప్రమాణస్వీకారానికి బెయిల్

జైలు నుంచే ఎంపీగా నామినేషన్ వేసి.. ఒక్క రోజు ప్రచారం చేయలే అయినా ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్ సింగ్ లోక్ సభ ఎన్నికల్లో గెలిచారు. పంజాబ్ ఏర్పాటు వాది అయిన అమృత్ పాల్ సింగ్ ప్రత్యేక పంజాబ్ దేశం కావాలని పోరాటం చేస్తున్నాడు. పంజాబ్​లోని ఖదూర్ సాహిబ్​లోక్​సభ నియోజకవర్గం నుంచి అమృత్​పాల్​ఇండిపెండెంట్ గా పోటీ చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జిరాపై సింగ్ లక్షా 97వేల 120 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే అమృత్​పాల్ ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నాడు. నాలుగు రోజుల పెరోల్ బెయిల్ పై వచ్చి ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. 

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు సింగ్ మద్దతుదారులు ఆయా వివరాలు అందించారు. జూలై 5న అమృత్ పాల్ సింగ్ ఎంపీగా లోక్ సభలో ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ ను 2023లో పంజాబ్ ఏర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్నాడని అరెస్ట్ చేశారు. కఠినమైన జాతీయ భద్రతా చట్టం (NSA)తో అభియోగాలు మోపారు. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలులో ఉన్నాడు.