రజనీకాంత్, విజయ్ కాంబోలో సినిమా.. జైలర్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

రజనీకాంత్, విజయ్ కాంబోలో సినిమా.. జైలర్ డైరెక్టర్ క్రేజీ కామెంట్స్

డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar).. ప్రస్తుతం ఈ పేరు ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది. ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer) మూవీ రికార్డ్స్ కలెక్షన్స్ రాబడుతోంది.  సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన ఈ సినిమా.. కేవలం మూడు రోజుల్లోనే రూ.200 కోట్లు కలెక్ట్ చేసి వసూళ్ల సునామి సృష్టిస్తోంది. 

దర్శకుడు నెల్సన్ కోలమవు కోకిల(Kolamavu kokila), డాక్టర్(Doctor) సినిమాలతో మంచి విజయాలు సాధించగా.. ఇప్పుడు జైలర్ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం జైలర్ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నెల్సన్.. సక్సెస్ ఇంటర్వ్యూలో పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగా తన డ్రీం ప్రాజెక్టు గురించి  మాట్లాడిన నెల్సన్.. చిన్నప్పట్నుంచి నాకు రజిని సర్ అంటే చాలా ఇష్టం. విజయ్ అన్నకి కూడా అభిమానినే. ఈ ఇద్దరితో ఎప్పటికైనా సినిమా చేయాలని అనుకునేవాడిని. ఇప్పుడు ఇద్దరితో సినిమాలు చేశాను కానీ.. రజిని సర్ – విజయ్ అన్నతో కలిపి ఓ సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఖచ్చితంగా ఈ ఇద్దరితో కలిపి సినిమా చేస్తాను, చేయడానికి ప్రయత్నిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు నెల్సన్.  ప్రస్తుతం నెల్సన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. 

ఈ న్యూస్ తెలుసుకున్న మ్యూచువల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సినిమా చేస్తే అది ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం. నెల్సన్ కల నిజమవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.