జైలర్లో బాలయ్య.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన నెల్సన్

జైలర్లో బాలయ్య.. ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పిన నెల్సన్

సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన జైలర్(Jailer) సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. నెల్సన్ కుమార్(Nelson kumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా మొదటిరోజు రూ.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది జైలర్. ఇక రెండో రోజు కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ రావడంతో.. కేవలం రెండు రోజుల్లోనే దాదాపు రూ.140 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సినిమా. 

ఈ సినిమా భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో దర్శకుడు నెల్సన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా జైలర్ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. జైలర్ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) క్యామియో కూడా ప్లాన్ చేశారట నెల్సన్. సినిమా క్లైమాక్స్ లో వచ్చే ఈ పాత్ర కోసం బాలకృష్ణను అనుకున్నాడట నెల్సన్.  కానీ ఆ పాత్ర మరీ చిన్నది కావడం, బాలకృష్ణ ఇమేజ్ కు సరితూగకపోవడంతో ఆ పాత్రను తీసేశారట. ఇప్పటికే ఈ సినిమాలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan lal), కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్(Shivaraj kumar) స్పెషల్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నెల్సన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

ఈ వీడియో చూసిన నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. జైలర్ లో రజనీకాంత్ అండ్ బాలయ్య కాంబో సెట్ చేసి ఉంటె బాగుండేది నెల్సన్ బయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వారు చెప్పినట్టుగా ఒక చిట్టా కామియో అయినా రజనీకాంత్ అండ్ బాలకృష్ణ కాంబోలో పది ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్ కు వెళ్ళేది అనడంలో ఎలాంటి సందేహం లేదు.