జైలర్ మానియా : రెండు రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలకు హాలిడే.. ఫ్రీ టికెట్స్

జైలర్ మానియా : రెండు రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలకు హాలిడే.. ఫ్రీ టికెట్స్

సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్(Jailer). డైరెక్టర్ నెల్సన్ కుమార్(Nelson kumar) తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్.. ఆగస్టు 10న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం జైలర్ రిలీజ్ డే స్పెషల్ గా..రెండు రాష్ట్రాల్లో ఐటీ కంపెనీలకు హాలిడే.. ఫ్రీ టికెట్స్  ప్రకటించడంతో జైలర్ మానియా దుమ్ము లేపుతోంది.   చెన్నై, బెంగళూరులోని ఐటీ కంపెనీల్లో తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించినట్లు సమాచారం. దీంతో పాటుగా తమ ఉద్యోగులకు ఫ్రీ టిక్కెట్లను కూడా ఇచ్చారంట. మరోసారి తలైవా రజినీ స్టామినా ఏంటో ఇండియా వైడ్ గా టాక్ వినిపిస్తోంది. 

ఒక ప్రముఖ కంపెనీ సోషల్ మీడియా లో హాలిడే ప్రకటిస్తూ..నోట్ రిలీజ్ చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషి ఆవుతోన్నారు.. సూపర్ స్టార్ రజినీ సినిమా జైలర్ రిలీజ్ స్పెషల్ గా..హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌ ఎంప్లొయ్స్ కి..మా కంపెనీ తరుపున 2023 ఆగస్టు 10న హాలిడే ప్రకటించాలని..ఫ్రీ టిక్కెట్‌లను ఇవ్వాలని నిర్ణయించుకున్నాము" అని నోటీసులో ఉంది. దీని ద్వారా యాంటీపైరసీకి మద్దతు ఇవ్వడానికే..ఇటువంటి డెసిషన్ తీసుకున్నట్లు..కంపెనీ హెడ్.. పేర్కొన్నారు.

ఈ సినిమా నుండి కావాలా(Kaavaalaa) అనే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్(Anirudh) సంగీతం అందించిన ఈ పాట రికార్డ్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ పాటలో మిల్కీ బ్యూటీ తమన్నా(Thamannaah) వేసిన స్టెప్స్ ఐతే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. తన గ్లామర్ తో ఆడియన్స్ కు మత్తెక్కించింది. 

ఇక రజినీకాంత్ కూడా చాలా కాలంగా సరైన హిట్ లేక సతమవుతున్నారు. అందుకే ఈ సినిమాపై రజిని కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు.  ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో రాబోతున్న జైలర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు బిజినెస్ చేసింది. మొత్తంగా జైలర్ మూవీతో రజినీకాంతో తెలుగులో బ్యాక్ బౌన్స్ అవుతారా లేదా అనేది చూడాలి.