జైలర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్‌ మరో గొప్ప సాయం..

జైలర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్‌ మరో గొప్ప సాయం..

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్‌ ఇండియా మూవీ జైలర్‌ (Jailer). ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా రూ.650 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.

లేటెస్ట్ గా జైలర్‌ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ తన మంచి మనసును చాటుకున్నారు. బ్రెయిన్ సమస్యతో బాధపడుతున్న పిల్లలకు ఫ్రీగా ఆపరేషన్లు, ట్రీట్ మెంట్ కు సంభందించిన అవసరాల కోసం, పలు మౌలిక సదుపాయాల కోసం రూ.38 లక్షల చెక్కును సన్ పిక్చర్స్ తరపున, శ్రీమతి కావేరి కళానిధి( Kavery Kalanithi ) అందించారు. 

ముఖ్యంగా మేధోపరంగా ఇబ్బందులు పడుతున్న పిల్లలు ఉండే  బాల విహార్ కు..అలాగే అంధులు, చెవిటి, మూగ వారు ఉండే లిటిల్ ఫ్లవర్ కాన్వెంట్ కు, వృద్ధాప్య నిరుపేద మహిళలు ఉండే విశ్రాంతి ఛారిటబుల్ ట్రస్ట్ కు, డాన్ బాస్కో చిల్డ్రన్స్ హోమ్ లలో పలు సౌకర్యాల మెరుగుదల కోసం సేవ చేస్తూ సన్ పిక్చర్స్ తమ హుదారతను చాటుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.

రీసెంట్గా అపోలో హాస్పిటల్స్ కి కళానిధి మారన్ ఏకంగా కోటి రూపాయల విరాళం అందజేశారు. ఈ డబ్బు ద్వారా చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్ నిర్వహించడం, వారి ఆరోగ్య పరమైన మౌలిక సదుపాయాల కోసం ఈ కోటి రూపాయల చెక్కును సన్ పిక్చర్స్ తరఫున శ్రీమతి కావేరి కళానిధి అపోలో హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ సి ప్రతాపరెడ్డి చేతికి అందజేశారు.

నెల్సన్‌ కుమార్‌ (Nelson Dilipkumar) దర్శకత్వం వహించిన జైలర్ మూవీని..సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్‌ (Kalanithi Maran) నిర్మించారు. దీంతో జైలర్ సక్సెస్ కి కారకులైన వారికి విలువైన గిఫ్ట్స్ ను ఇస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక ఇప్పటికే రజినీకాంత్‌కు రూ.1.24 కోట్ల BMW X7 కారుతో పాటు రూ.100 కోట్ల చెక్కును కూడా అందించారు. డైరెక్టర్ నెల్సన్‌కు కూడా పోర్చే లేటెస్ట్‌ కారు (Porsche Car)ను, చెక్కును అందజేశారు. నెల్సన్‌కు ఇచ్చిన కారు ఖరీదు రూ1.25 వరకు ఉంటుందని అంచనా.