జైలర్ రికార్డ్ కలెక్షన్స్..4 రోజుల్లో ఎంతంటే?

జైలర్ రికార్డ్ కలెక్షన్స్..4 రోజుల్లో ఎంతంటే?

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..ఆగస్టు 10న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అదే రేంజ్ లో రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా.

లేటెస్ట్ గా ఈ సినిమా 4 రోజుల్లోనే  రూ. 300కోట్ల వసూళ్లను సాధించింది. రజినీ గత చిత్రం రోబో 2.O(రూ.405) కోట్లు కలెక్షన్స్ చేసింది. ఇక జైలర్ మూవీ  రిలీజైన..4 రోజుల్లోనే ఈ రికార్డ్స్ కలెక్షన్స్ సాధించిన రెండో తమిళ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ నిన్న ఆదివారం (ఆగస్టు13న) వరల్డ్ వైడ్ గా రూ.31 కోట్లు వసూళ్లను సాధించింది. 

 జైలర్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇక రెండో రోజు రూ.56 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. మూడో రోజు 68 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో మూడు రోజుల్లోనే జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక షేర్ విషయానికి వస్తే రూ.110 కోట్లపైనే ఉండనుంది. ఇప్పటికే చాలా చోట్ల జైలర్ బ్రేక్ ఈవెన్ సాధించి.. లాభాలు బాట పట్టింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక తెలుగులో కూడా ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాలతో దూసుకుపోతోంది. భోళా శంకర్ కు నెగిటీవ్ టాక్ రావడంతో.. దాన్ని జైలర్ క్యాష్ చేసుకుంటోంది. ఇదే ఊపు గనుక కంటిన్యూ అయితే..మరో రెండు మూడు రోజుల్లో రూ.500 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చిరంజీవి భోళా శంకర్ మూవీ పోటీ ఉన్నప్పటికీ.. జైలర్ మాత్రం కలెక్షన్స్ కోత కొనసాగిస్తోంది. భోళా శంకర్ మూవీ సినిమా టిక్కెట్ల అమ్మకాలు ఫస్ట్ వీకెండ్ లోనే బాగా తగ్గాయి.