జైలర్ సెకండ్ లిరికల్ అప్డేట్.. హుకుమ్ జారీ చేసిన రజినీ

 జైలర్ సెకండ్ లిరికల్ అప్డేట్.. హుకుమ్ జారీ చేసిన రజినీ

సూపర్ స్టార్  రజినీకాంత్(Rajinikanth) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ జైలర్(Jailer). నెల్సన్ కుమార్(Nelsan kumar) దర్శకతం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజినీ నుండి వచ్చిన గత రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో.. జైలర్ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. 

తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ లిరికల్ జూలై 17న రిలీజ్ చేస్తున్నట్లు సాంగ్ పోస్టర్ ను ప్రకటించారు మేకర్స్.  ఈ పోస్టర్ లో రజినీ చుట్టూరా.. రౌడీలు చుట్టూ ముట్టడంతో.. హుకుమ్..ఇది టైగర్ యొక్క ఆదేశం అంటూ రజినీ వాయిస్ తో ఇంటెన్సిటీని పెంచేశారు డైరెక్టర్ నెల్సన్. ఇక ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందో అంటూ ఫ్యాన్స్ వెయిట్  చేస్తున్నారు. 

ఇటీవల, మేకర్స్ తమన్నా నటించిన పెప్పీ డ్యాన్స్ నంబర్ కావలా అనే మొదటి సింగిల్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ కుర్రకారును ఊపేస్తోంది. ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజిని నుండి వచ్చిన గత రెండు సినిమాలు సరిగా ఆడకపోవడంతో.. జైలర్ సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి. ముత్తువేల్ పాండియన్ అనే పాత్రలో రజనీ నటిస్తున్నారు.

డైరెక్టర్ నెల్సన్ నాల్గవ మూవీ జైలర్. గత చిత్రం దళపతి విజయ్ తో బీస్ట్ మూవీ తెరకెక్కించి ప్రశంశలు అందుకున్న నెల్సన్.. మొదటిసారిగా రజనీకాంత్‌తో వర్క్ చేయబోతున్నారు. ఈ మూవీకి లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ (Anirudh) సంగీతం అందిస్తుండగా విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రాఫర్‌గా, నిర్మల్ ఎడిటర్‌గా సన్ పిక్చర్స్ బ్యానర్ ఈ మూవీను నిర్మిస్తుంది. 

జైలర్ లో  మోహన్‌లాల్, సునీల్, జాకీ ష్రాఫ్, శివరాజ్‌కుమార్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యోగి బాబు, రమ్యకృష్ణ మరియు వినాయకన్ తదితరులు కూడా నటించనున్నారు. ముత్తువేల్ పాండియన్ అనే పాత్రలో రజనీ నటిస్తున్నారు.

#Hukum ? Idhu Tiger-in Kattalai#JailerSecondSingle is ready to fire on July 17th ?@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial @Mohanlal @NimmaShivanna @bindasbhidu @tamannaahspeaks @meramyakrishnan @suneeltollywood @iYogiBabu @iamvasanthravi @kvijaykartik @Nirmalcutspic.twitter.com/5gqRMyXIcQ

— Sun Pictures (@sunpictures) July 13, 2023