జైలర్ ట్రైలర్‌‌‌‌ : మాటలు ఉండవు.. కోతలే

జైలర్ ట్రైలర్‌‌‌‌ :   మాటలు ఉండవు.. కోతలే

రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందించిన చిత్రం ‘జైలర్’. సన్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌పై కళానిధి మారన్  నిర్మించిన ఈ  సినిమా ఆగస్టు 10న వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల అవుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం షో కేస్ పేరుతో తెలుగు ట్రైలర్‌‌‌‌ను హీరో నాగ చైతన్య రిలీజ్ చేశాడు.  పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్‌‌తో రిలీజైన వీడియో సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది.  తనదైన లుక్,  పెర్ఫార్మెన్స్, స్వాగ్, డైలాగ్ డెలివరీతో రజినీకాంత్ ఆకట్టుకున్నారు. రజినీకి భార్యగా  రమ్యకృష్ణ, విలన్‌‌గా జాకీష్రాఫ్, కీలకపాత్రలో సునీల్ కనిపించారు. 

ఈ డిసీజ్ వచ్చిన వాళ్లు పిల్లి పిల్లలా ఉంటారు.. కానీ ఒక్కోసారి పులిలా మారుతారు’ అంటూ డాక్టర్ చెబుతున్న మాటలతో రజినీకాంత్ క్యారెక్టర్‌‌‌‌ను పరిచయం చేశారు. అందుకు తగ్గట్టే మొదట్లో కొడుక్కి, మనవడికి షూస్ పాలిష్ చేస్తూ కనిపించిన తలైవా.. ఆ తర్వాత విలన్స్‌‌ను చితక్కొడుతూ కనిపించారు. ‘ఒక రేంజ్ తర్వాత మన దగ్గర మాటలు ఉండవు. కోతలే..’ అంటూ రజినీ చెప్పిన డైలాగ్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. జైలర్‌‌గా యూనిఫామ్‌‌తో పాటు  స్టైలిష్ లుక్స్‌‌తో రజినీ ఇంప్రెస్ చేస్తున్నారు. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాక్షన్‌‌ని మరింతగా ఎలివేట్ చేసింది. తమన్నా హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మోహన్‌‌లాల్‌‌, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, నాగబాబు నటించారు.  ఏషియన్ మల్టీప్లెక్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది.