కాలేజీకి వెళ్తూనే కోడింగ్‌‌, యాప్‌‌ డెవలపింగ్‌‌ నేర్చుకుంటున్నడు

కాలేజీకి వెళ్తూనే కోడింగ్‌‌, యాప్‌‌ డెవలపింగ్‌‌ నేర్చుకుంటున్నడు

కొందరికి కొన్ని విషయాలమీద ఎక్కువ ఇంట్రెస్ట్‌‌ ఉంటుంది. వాటిమీదే ఎక్కువ ఫోకస్‌‌ పెడుతుంటారు కూడా. ఆ ఇంట్రెస్ట్‌‌తోనే దాంట్లో పట్టు సాధించి లైఫ్‌‌లో సెటిల్‌‌ అవుతుంటారు. అలాగే, ఈ స్టూడెంట్‌‌కి ఉన్న ఇంట్రెస్ట్‌‌ అతనికి డబ్బులు సంపాదించి పెట్టింది. కోట్లమంది యూజర్లను హ్యాకర్ల బారిన పడకుండా కాపాడింది కూడా.

జైపూర్‌‌‌‌కి చెందిన నీరజ్‌‌ శర్మకు యాప్‌‌ డెవలపింగ్‌‌ అంటే ఇష్టం. కాలేజీకి వెళ్తూనే కోడింగ్‌‌, యాప్‌‌ డెవలపింగ్‌‌ నేర్చుకుంటున్నాడు. ఈ మధ్యే సోషల్‌‌ మీడియా యాప్ ఇన్‌‌స్టాగ్రామ్‌‌ రీల్స్‌‌లో బగ్‌‌ కనిపెట్టి వార్తల్లోకి ఎక్కాడు. ఇన్‌‌స్టాగ్రామ్‌‌ రీల్స్‌‌కి తంబ్‌‌ నెయిల్స్‌‌ ఉంటాయి. ఐడీ ప్రూఫ్‌‌, పాస్‌‌వర్డ్‌‌ లేకుండా గూగుల్‌‌ ద్వారా యూజర్ల ఇన్‌‌స్టాగ్రామ్‌‌ అకౌంట్‌‌ ఓపెన్‌‌ చేయొచ్చు. దాంతో ప్రైవేట్‌‌ అకౌంట్‌‌లో లేనివాళ్ల రీల్స్‌‌ తంబ్‌‌ నెయిల్స్‌‌ని ఐదు నిమిషాల్లో ఎవరైనా మార్చేయొచ్చు అనే విషయాన్ని కనిపెట్టాడు. ఆ వివరాలు హ్యాకర్లకు చిక్కితే యూజర్ల ప్రైవసీకి ప్రమాదం. అయితే, ఈ వివరాలన్నీ చెప్తూ ఇన్‌‌స్టాగ్రామ్‌‌కి పోయిన ఏడాది డిసెంబర్‌‌‌‌లో రిపోర్ట్‌‌ పంపాడు. చాలా ఆలస్యంగా రెస్పాండ్ అయింది ఇన్‌‌స్టాగ్రామ్‌‌. బగ్‌‌ కనిపెట్టినందుకు నీరజ్‌‌కి ‘థ్యాంక్యూ’ చెప్తూ అతనికి 35 లక్షల రూపాయలు ఇచ్చింది. అదేకాకుండా లేట్‌‌గా రిప్లై ఇచ్చినందుకు ‘సారీ’ చెప్తూ మరో మూడు లక్షల రూపాయలు బోనస్‌‌గా ఇచ్చింది ఇన్‌‌స్టాగ్రామ్‌‌.