పాట్నా: ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్ 42–27తో తమిళ్ తలైవాస్‌ను ఓడించింది. దీంతో ఆడిన 17 మ్యాచ్‌ల్లో 12 విజయాలతో 71 పాయింట్లు సాధించిన జైపూర్ టాప్ ప్లేస్‌తో ప్లే ఆఫ్స్‌కు చేరింది. తలైవాస్‌తో మ్యాచ్‌లో జైపూర్ రైడర్స్ అర్జున్ దేశ్వాల్ (13), అజిత్ (9), రెజా (4), సాహుల్ కుమార్ (4) రాణించారు. తమిళ్ టీమ్‌లో నరేందర్ 12 పాయింట్లు సాధించినా లాభం లేకపోయింది. పట్నా పైరేట్స్, బెంగళూరు బుల్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 29–29తో డ్రా అయ్యింది. పట్నా రైడర్ సందీప్ 14 పాయింట్లతో హోరెత్తించాడు. సుశీల్ (8), అక్షిత్ (6) బుల్స్‌కు పాయింట్లు అందించారు.
