- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్ బాగ్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన అనుభవం లేదని ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.
పొంతన లేకుండా జీవోలు జారీ చేస్తూ వాటిని అమలు చేయకుండా ప్రజలను గందరగోళ పరిస్థితిలోకి నెట్టుతుందని విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేశ్ చారి, కన్వీనర్ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కుల గణనను చేపట్టాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని దానిని చేపట్టాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కుల గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏడు సార్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
ల గణన చేపట్టకుండా ఎన్నికలకు పోతే బీసీల ద్రోహిగా కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిపోతుందన్నారు. బీసీలను మోసం చేయాలని చూస్తే కేసీఆర్కు పట్టిన గతే రేవంత్ రెడ్డి కి పడుతుందన్నారు. కుల గణనను 60 రోజుల్లో చేపట్టాలని.. లేకపోతే వచ్చే ఎన్నికల్లో రేవంత్ ను గద్దె దింపుతామని జాజుల హెచ్చరించారు.