ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

మిర్యాలగూడ, వెలుగు : సంక్షేమ పథకాల పేరిట ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఈ నెల 2న ప్రారంభమైన బీసీ యువజన విద్యార్థి పోరుయాత్ర బుధవారం మిర్యాలగూడకు చేరుకుంది. ఈ సందర్బంగా పట్టణంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అవినీతిరహిత పాలన అందిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌కు తన కుటుంబం, మంత్రి వర్గంలో జరుగుతున్న అవినీతి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. వందలాది మంది ప్రాణత్యాగం చేస్తే ఏర్పడిన తెలంగాణలో సామాజిక న్యాయం అమలుకావడం లేదన్నారు. బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ప్రజాస్వామిక పద్ధతుల్లో తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. స్కూళ్లు, కాలేజీల ఏర్పాటును పట్టించుకోకుండా వంద మందికో బెల్ట్‌‌‌‌‌‌‌‌ షాపు, వెయ్యి మందికో వైన్స్‌‌‌‌‌‌‌‌, బార్‌‌‌‌‌‌‌‌ను తెరిచారన్నారు. బీసీ యువజన విద్యార్థి పోరుయాత్రను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్‌‌‌‌‌‌‌‌, బీసీ సంఘం నేతలు కుల్కచర్ల శ్రీనివాస్, బంటు వెంకటేశ్వర్లు, విక్రం, నగేశ్‌‌‌‌‌‌‌‌, ఎ.మురళి, మహేశ్‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌, పరమేశ్‌‌‌‌‌‌‌‌, దుర్గయ్య పాల్గొన్నారు.


దళితబంధుతో ఆర్థికంగా ఎదగాలి

యాదగిరిగుట్ట, వెలుగు : దళితబంధు పథకాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని యాదాద్రి అడిషనల్‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌ తివారి సూచించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో బుధవారం దళితబంధు లబ్ధిదారులతో మాట్లాడారు. యూనిట్లు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, వారి జీవన విధానంలో వచ్చి మార్పులు ఏమిటో అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా ఎదిగేందుకు దళితబంధు పథకం ఎంతో ఉపయోగపడుతోందన్నారు. అనంతరం జడ్పీ హైస్కూల్‌‌‌‌‌‌‌‌ను సందర్శించి స్టూడెంట్లతో మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఈడీ శ్యాంసుందర్, ఎంపీడీవో ఉమాదేవి, వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్ ఏఈ భిక్షపతి గౌడ్, విలేజ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.


ఫార్మా కంపెనీ పనులను నిలిపివేయండి

చండూరు, వెలుగు : నల్గొండ జిల్లా గట్టుప్పల్‌‌‌‌‌‌‌‌లో జరుగుతున్న ఫార్మా కంపెనీ పనులను నిలిపివేయాలని గ్రామస్తులు కోరారు. ఈ మేరకు బుధవారం జడ్పీటీసీ కర్నాటి వెంకటేశంతో కలిసి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో మంత్రి జగదీశ్‌‌‌‌‌‌‌‌రెడ్డిని కలిశారు. గతంలో పోరాటం చేయడంతో పనులు నిలిపివేశారని, ప్రస్తుతం మళ్లీ పనులు చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే ప్లోరోసిస్‌‌‌‌‌‌‌‌తో చాలా ఇబ్బందులు పడుతున్నామని, ఇప్పుడు కంపెనీ ఏర్పాటుతో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మంత్రి కలెక్టర్‌‌‌‌‌‌‌‌తో మాట్లాడుతానని హామీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ జడ్పీటీసీ నామని గోపాల్, ఎంపీటీసీ అవ్వారి గీతా శ్రీనివాస్, టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మండల కన్వీనర్‌‌‌‌‌‌‌‌ ఇడం కైలాసం, బండారి చంద్రయ్య, కర్ణాటి అశోక్ పాల్గొన్నారు.


సామాజిక సేవలో ‘స్పెక్ట్రా’ ముందంజ

యాదగిరిగుట్ట, వెలుగు : సామాజిక సేవా కార్యక్రమాల్లో ‘స్పెక్ట్రా’ రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ సంస్థ ముందుంటుందని ఆ కంపెనీ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ మరియాల జగన్‌‌‌‌‌‌‌‌మోహన్‌‌‌‌‌‌‌‌ చెప్పారు. బుధవారం స్థానికంగా ఆయన మాట్లాడుతూ కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత మేరక పేదల కోసం, ఆటల్లో రాణించే క్రీడాకారుల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు అండగా నిలుస్తున్నామని, తమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసే వితంతువులు, దివ్యాంగుల రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ ఖర్చులు సైతం తామే భరిస్తున్నట్లు చెప్పారు. 2008లో ఏర్పాటు చేసిన సంస్థ నేడు 14వ వార్షికోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సంస్థ తరఫున వరంగల్, బెంగుళూరు, విజయవాడ, శ్రీశైలం సహా యాదగిరిగుట్ట పరిసరాల్లో విల్లాస్, అపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌, రిసార్ట్స్, ప్లాట్స్‌‌‌‌‌‌‌‌ నిర్మించినట్లు చెప్పారు. ప్రభుత్వ రూల్స్‌‌‌‌‌‌‌‌, ప్రజల అభిరుచికి తగ్గట్లుగా అత్యాధునిక వసతులతో నిర్మాణాలు చేస్తున్నామన్నారు. మార్కెటింగ్, అడ్మినిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ విభాగాల ద్వారా ఐదు వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించామని తెలిపారు.


కోదాడలో బీఎస్పీ విజయం ఖాయం

కోదాడ, వెలుగు : ఎన్నికలు ఎప్పుడొచ్చినా కోదాడలో బీఎస్పీ గెలవడం ఖాయమని ఆ పార్టీ సూర్యాపేట జిల్లా ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి పిల్లుట్ల శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌ ధీమా వ్యక్తం చేశారు. కోదాడలో బుధవారం మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ లీడర్ల అక్రమాలు, అరాచకాలకు కోదాడ అడ్డాగా మారిందన్నారు. అనర్హులకు పథకాలు మంజూరు చేస్తున్న ఎమ్మెల్యేకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. దళితబంధు పేరుతో దళితులను బీఎస్పీకి దూరం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. డబుల్‌‌‌‌‌‌‌‌ బెడ్‌‌‌‌‌‌‌‌రూం ఇండ్లు నిర్మించి ఐదేళ్లు కావస్తున్నా పంపిణీ చేయకపోవడంతో ప్రస్తుతం అవి శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 

బ్యాంకులు రుణ లక్ష్యం పూర్తి చేయాలి

యాదాద్రి, వెలుగు : ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకులు లోన్లు అందించాలని యాదాద్రి కలెక్టర్‌‌ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టరేట్‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్‌‌ వరకు పంట రుణాలు, దీర్ఘకాలిక రుణాలు కలిపి రూ. 928 కోట్లు ఇచ్చామని, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 167 కోట్లు, ఎడ్యుకేషన్‌‌కు రూ. 8 కోట్లు, ఇంటి నిర్మాణాలకు రూ. 19 కోట్లతో పాటు ప్రాధాన్యతా రంగాలకు రూ.13 కోట్లు ఇచ్చామని బ్యాంకర్లు తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు రూ. 334 కోట్లు, మెప్మా కింద రూ. 42. 50 కోట్లు, వీధి వ్యాపారులకు రూ. 4.15 కోట్ల లోన్‌‌ ఇచ్చినట్లు ఆఫీసర్లు కలెక్టర్‌‌కు వివరించారు. అనంతరం నాబార్డు 2023–--24 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్‌‌ విడుదల చేశారు. సమావేశంలో లీడ్‌‌ బ్యాంక్‌‌ ఆఫీసర్​ రామకృష్ణ, డీఆర్డీవో ఉపేందర్‌‌రెడ్డి, ఆర్బీఐ లీడ్‌‌ ఆఫీసర్‌‌ శివరామన్, నాబార్డు డీడీఎం వినయ్‌‌కుమార్‌‌, జిల్లా పరిశ్రమల ఆఫీసర్​ లక్ష్మి, వెటర్నరీ ఆఫీసర్‌‌ కృష్ణ, మెప్మా డైరెక్టర్‌‌ రమేశ్‌‌ పాల్గొన్నారు.