
యాదాద్రి, వెలుగు : సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో భువనగిరిలోని జీనియస్ హైస్కూల్ వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. సుశీల్ సింగ్ కుషువా 500 మార్కులకు 479 మార్కులు సాధించి జిల్లా టాపర్ గా నిలిచాడు. బాలికల్లో బి.ఆశ్రిత 456, కె.సత్యశివమణి 428, ఎం.ప్రణవి 421, సీహెచ్ఎం అభిరాంరెడ్డి 414 మార్కులు సాధించారు. పరీక్షలు రాసిన 69 మంది విద్యార్థులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. బుధవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను కరస్పాండెంట్ డాక్టర్ బి.సూర్యనారాయణరెడ్డి, చైర్మన్ పడాల శ్రీనివాస్, డైరెక్టర్ తోట శ్రీధర్, ప్రిన్సిపాల్ బి.స్వర్ణలత అభినందించారు.