సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి : యాదాద్రి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ

సమ్మర్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి : యాదాద్రి జిల్లా విద్యాధికారి సత్యనారాయణ

యాదగిరిగుట్ట, వెలుగు : ప్రభుత్వం నిర్వహిస్తున్న సమ్మర్​ క్యాంపులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈవో సత్యనారాయణ సూచించారు. యాదగిరిగుట్టలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సమ్మర్ క్యాంపును ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి చెస్, క్యారమ్ ఆడారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ సమ్మర్ క్యాంపులో భాగంగా విద్యార్థులకు యోగా, స్పోకెన్ ఇంగ్లిష్, లైఫ్ స్కిల్స్, ఇండోర్ గేమ్స్(చెస్, క్యారమ్), డ్రాయింగ్ వంటి అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు.

గురువారం మొదలైన సమ్మర్ క్యాంప్ 15 రోజులపాటు ఉంటుందని, యాదగిరిగుట్టతోపాటు యాదగిరిపల్లి, దాతరుపల్లి, మల్లాపురం హైస్కూళ్లలో కూడా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, డ్రాయింగ్, కరాటే వంటి కళలను సైతం నేర్చుకోవాలని సూచించారు. 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు.

కార్యక్రమంలో ఎంఈవో శరత్ యామినీ, కాంప్లెక్స్ హెచ్ఎం మల్లికార్జున్, హైస్కూల్ హెచ్ఎంలు నరేందర్, శ్రీనివాస్ రెడ్డి, సబీరాబేగం, శంకరయ్య, ఎంఆర్సీ సిబ్బంది భాస్కర్, రమాదేవి, సీఆర్పీలు బిక్షపతి, రమేష్, సంగీత, సంజీవ తదితరులు ఉన్నారు.