మేడిగడ్డపై విచారణకు డ్యామ్​సేఫ్టీ కమిటీ

మేడిగడ్డపై విచారణకు డ్యామ్​సేఫ్టీ కమిటీ
  • కాళేశ్వరం డిజైన్​సీడబ్ల్యూసీ ఆమోదించలే
  •  కేంద్రాన్ని మ్యానిప్లెట్ చేసిండ్రు
  • తుమ్మడిహెట్టి వద్ద నీళ్లు లేవని బీఆర్ఎస్​తప్పుడు ప్రచారం
  • కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ వెదిరే

వచ్చేవారంలో బ్యారేజీ పరిశీలన

హైదరాబాద్: మేడిగడ్డపై విచారణకు డ్యామ్​సేఫ్టీ కమిటీ ఏర్పాటైంది. చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో వచ్చే వారంలో ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డకు పరిశీలించనుంది. మేడిగడ్డ అక్రమాలు, నదులు,  ప్రాజెక్టులపై ప్రజెంటేషన్​లో కేంద్ర జలశక్తి సలహాదారు శ్రీరామ్ వెదిరే వివరాలు వెల్లడించారు.  ‘కాళేశ్వరం డిజైన్, ఇన్వెస్ట్మెంట్ ను ​సీడబ్ల్యూసీ అప్రూవల్ చెయ్యలేదు. 80 వేల కోట్లు ఎందుకు ఖర్చు అవుతుంది అన్న ప్రశ్నలకు గత ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. ​సీడబ్ల్యూసీ డిజైన్ల ప్రకారం ప్రాజెక్టులు కట్టాం అనేది కూడా అవాస్తవం. 

ALSO READ | కేసీఆర్ వల్లే పాలమూరు ఆగమైంది : చల్లా వంశీచంద్​రెడ్డి

ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్రాలను ​సీడబ్ల్యూసీ నమ్ముతుంది. అందుకే డిజైన్లు చూడలేదు. గోదావరిలో ఏడాదంతా నీళ్లు ఉంటాయని ​సీడబ్ల్యూసీ చెప్పింది. రాష్ట్రం మాత్రం 60 రోజుల్లోనే ఎత్తిపోస్తాం అన్నది. రోజుకు రెండు టీఎంసీల లెక్క లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా. మూడో టీఎంసీ కోసం అప్రూవల్ అడిగింది. ఒక ఎకరాకు వంద క్వింటాళ్లు వస్తాయని కేంద్రాన్ని మ్యానిప్లెట్ చేశారు. మేడిగడ్డ అనుమతుల వివరాలు ఇవ్వాలని అడిగాం. బీఆర్ఎస్ పార్షల్ సమాచారం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవ్వడం లేదు. మేడిగడ్డ రిజర్వాయర్ ఫెయిల్యూర్ కి సీడబ్య్లూసీకి సంబంధం లేదు’ అని ఆయన స్పష్టంచేశారు.

మహారాష్ట్రను ఒప్పించలే

‘తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని బీఆర్ఎస్​తప్పుడు ప్రచారం చేసింది. చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్ట్ కోసం గత ప్రభుత్వం మహారాష్ట్రను ఓప్పించలేకపోయింది.  అందుకే రీడిజైన్ చేసి కాళేశ్వరం కట్టారు. . రూ.11వేల 99కోట్లతో అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్  చేవెళ్ల ప్రాణ హిత ప్రాజెక్ట్ డిజైన్ చేసింది. 40వేల కోట్ల ప్రాజెక్ట్ ను లక్షా 20వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వ ఖర్చు చేసింది’ అని శ్రీరామ్​తెలిపారు.