ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు జిలేబి

ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు జిలేబి

దర్శకుడు విజయ్ భాస్కర్ తన కొడుకు శ్రీకమల్‌‌‌‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ‘జిలేబి’. గుంటూరు రామకృష్ణ నిర్మించారు.  శివాని రాజశేఖర్ హీరోయిన్‌‌‌‌గా, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 18న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.  విజయ్ భాస్కర్ గతంలో తెరకెక్కించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు తరహాలోనే ఇది  కూడా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా రూపొందినట్టు తెలుస్తోంది.  

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌‌‌తో పాటు పంచ్ డైలాగ్స్‌‌‌‌తో  ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది.  శ్రీకమల్, శివాని రాజశేఖర్  పాత్రలు వినోదాత్మకంగా ఉన్నాయి. హారర్ ఎలిమెంట్స్ క్యూరియాసిటీ పెంచాయి. మణిశర్మ అందించిన బ్యాక్‌‌‌‌గ్రౌండ్ స్కోరు మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి ట్రైలర్  ‘జిలేబి’ హిలేరియస్ ఫన్ ఫుల్ థ్రిల్  రైడ్‌‌‌‌గా అనిపిస్తుంది.