ఉరి సెక్టార్‭లో వెపన్స్ కలకలం

ఉరి సెక్టార్‭లో వెపన్స్ కలకలం

ఉరి: జమ్మూకాశ్మీర్​లోని బారాముల్లా జిల్లాలో పెద్ద ఎత్తున వెపన్స్, మందుగుండు సామగ్రి పట్టుబడ్డాయి. ఆదివారం ఉరి సెక్టార్​లోని హలంగా వద్ద జమ్మూకాశ్మీర్ పోలీసులు, ఇండియన్ ఆర్మీ జరిపిన సెర్చ్ ఆపరేషన్​లో 74 ఏకే 47 రైఫిళ్లు, 24 మేగజైన్లు, 560 బులెట్లు, 12 చైనీస్ పిస్టల్స్, 224 లైవ్ పిస్టల్ రౌండ్స్, 14 పాకిస్తాన్, చైనీస్ గ్రనేడ్లు, 81 బెలూన్లు, పాక్ జెండాలు దొరికాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఆర్మీ అధికారులు.. వివరాలు మీడియాకు తెలిపారు. 

ఎల్ఏసీ నుంచి మనదేశంలోకి వచ్చేందుకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో సెర్చింగ్ ప్రారంభించారని, దీంతో ఆ టెర్రరిస్టులే ఈ వెపన్స్ వదిలి పారిపోయుంటారని చెప్పారు. ఇప్పటికే కొద్దిరోజులుగా వెపన్స్, డ్రగ్స్​ అక్రమంగా మనదేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరిగాయన్నారు.