ఇంట్లోకి చొరబడి పోలీస్ అధికారిని చంపిన ఉగ్రవాదులు

ఇంట్లోకి చొరబడి పోలీస్ అధికారిని చంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు దారుణానికి తెగబడ్డారు.  పుల్వామా జిల్లాలోని హరిపారిగమ్ ప్రాంతంలో  స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఫయాజ్ అహ్మద్  సహా ఆయన ఇద్దరు కుటుంబ సభ్యులపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఫయాజ్ అహ్మద్, ఆయన భార్య రజా బేగమ్ ప్రాణాలు కోల్పోయారు. ఫయాజ్ అహ్మద్ కూతురు రఫియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. నిన్న  రాత్రి 11 గంటల టైంలో ఫయాజ్ అహ్మద్ ఇంట్లోకి చొరబడిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతాబలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.