
శ్రీనగర్ : జమ్మూలో దారుణానికి ఒడిగట్టారు ఉగ్రవాదులు. మహిళా పోలీసు ఆఫీసర్ ను దొంగచాటుగా కాల్చి చంపారు. ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం కశ్మీర్ లోని సోపియాన్ జిల్లాలో జరిగింది. వెహిల్ గ్రామంలో ప్రత్యేక పోలీసు అధికారిణి కుష్బూ జాన్ ను ఆమె ఇంటి దగ్గరే చంపారు. ఆ సమయంలో ఎవరూలేరు. మారువేశంలో వచ్చిన ఉగ్రవాదులు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుస్తుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ఆపరేషన్ ను ప్రారంభించాయి.