కాశ్మీర్ లో గెలుపు ఎవరిదో?

కాశ్మీర్ లో గెలుపు ఎవరిదో?

జనరల్‌‌ ఎలక్షన్స్‌‌ ప్రచారంలో అధికార బీజేపీ ఎక్కువగా ప్రస్తావిస్తున్న అంశం జమ్మూకాశ్మీర్ . ఈ రాష్ట్రం లో ఎన్నికలను 5 దశల్లో నిర్వహిస్తున్నారు. ఇక్కడ మొత్తం 6 లోక్​సభ ని యోకవర్గాలు ఉన్నాయి. ఇందులో రెండు చోట్ల (జమ్మూ, బారాముల్లాలో) ఈ నెల 11న జరిగి న మొదటి దశలోనూ, మరో రెండు స్థా నాల్లో (శ్రీనగర్​, ఉదంపూర్​లో) 18న జరిగి న సె కండ్ ఫేజ్ లో పోలింగ్‌ పూర్తయ్యింది. మిగిలిన రెండు సె గ్మెం ట్లలో ఒకటి లడఖ్ కాగా,రెండోది అనంతనాగ్. లడఖ్ లో వచ్చే నెల 6న అయిదో విడతలో ఓటింగ్‌ జరుగుతుంది. అనంతనాగ్‌ నియోజకవర్గంలో మాత్రం గతంలో ఎన్నడూలేని విధంగా మూడు ఫేజుల్లో (మూడు, నాలుగు, అయిదు విడతల్లో ) పోలింగ్​ పెట్టారు. ఈ నెల 23, 29 తేదీలతోపాటు వచ్చే నెల 6 వ తేదీల్లో ఓటింగ్​ జరగనుంది. జాతీయవాదాన్ని బలంగా వినిపించే కమలనాథులు తాము మళ్లీ పవర్​లోకొస్తే జమ్మూ–కాశ్మీర్​లో చేపట్టబోయే చర్యలను దేశవ్యా ప్తంగా క్యాం పెయిన్ లో నొక్కి చెబుతున్నారు.

తొలిసారి పోలింగ్​లో పాల్గొనే యువత బీజేపీకి మద్దతివ్వాలని ప్రధాని మోడీ కోరుతున్నారు. యూత్ తమ ఓట్లను పుల్వా మా దాడిలో చనిపోయిన జవాన్లకు అంకితమివ్వాలని సూచిస్తున్నారు. ఈ దాడికి ప్రతీకారంగా తమ ప్రభుత్వం పాకిస్థాన్ లోని బాలాకోట్ లో జైషే మహ్మద్ స్థా వరాలపై ఎయిర్​స్ట్రైక్స్​ను విజయవంతంగా పూర్తిచేసిన విషయాన్ని మోడీ తన ప్రచారంలో పదే పదే గుర్తు చేస్తున్నారు. ఓటర్లు ఇలాంటి  ఇష్యూస్​ గురించి పెద్దగా పట్టించుకోవట్లేదు.రాష్ట్రా ని​కి ఉన్న స్పెషల్ స్టేటస్​కి ముప్పు రానుండటం గురించి, అక్కడ నిత్యం సెక్యూరిటీ బలగాల నీడలో బతకటం గురించి ఆందోళన చెందుతున్నారు. మోడీ సర్కారు రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న కఠిన విధానాలు వాళ్లను ఆలోచనలో పడేశాయి. జమ్మూకాశ్మీర్​లో పరిస్థితిని భద్రతా బలగాలతో దారికి తెచ్చుకోవాలని కేంద్రం అనుకుంటోంది. రాష్ట్రంలోకి చొరబడుతున్న టెర్రరిస్టులను అణచివేసేందుకు సైన్యాన్ని ఉపయోగిస్తోంది. ఫలితంగా మిలిటెంట్లకు, మిలటరీకి మధ్య జరుగుతున్న కాల్పుల్ లో ప్రజలు పెద్దఎత్తున ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక్క 2018లోనే 160 మంది పౌరులు చనిపోయారు. ఇందులో 31మంది పిల్లలు, 18 మంది ఆడవాళ్లు ఉన్నారు. వయొలెన్స్​లో మరణించిన టెర్రరిస్టులను, సైనికులను కూడా కలిపితే మొత్తం మృతుల సంఖ్య 500 దాటుతుంది.

మూడు పార్టీల మధ్య పోటీ

రాష్ట్రం లో పోటీ ముఖ్యం గా మూడు పార్టీల మధ్య నెలకొం ది. అందులో ఒకటి.. పీపుల్స్​ డె మొక్రటిక్​ పార్టీ (పీడీపీ). రెండోది.. బీజేపీ. మూడోది.. నేషనల్ కాన్ఫరెన్స్​(ఎన్ సీ)–కాంగ్రెస్ కూటమి . బీజేపీ మినహా మిగతా మరే పార్టీ వివాదాస్పదమైన ఆర్టికల్ – 370, ఆర్టికల్ –35ఏల జోలికి వెళ్లబోమంటున్నా యి. ఆ ప్రొవిజన్లను తొలగించి తీరతామని బీజేపీ ఒక్కటే హామీ ఇస్తోంది. దీంతో కమలం క్యాం డిడేట్లు ఇరకాటంలో పడుతున్నారు. ఫలితంగా వాళ్లు వాటికి బదులు వేరే సమస్యలను ప్రస్తావిస్తున్నారు. 2014లో బీజేపీ, పీడీపీ మూడు చొప్పున సీట్లు గెలిచాయి. వేర్పాటు దాడులకు నిలయం హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్​ బుర్హా న్ వనీని ఇండియన్ ఆర్మీ మూడేళ్ల కిందట హతమార్చినప్పటి నుంచి అ నంతనాగ్​లో వేర్పాటువాదులు హింస కు పాల్పడుతున్నారు. ఈ సెగ్మెంట్ పుల్వా మా జిల్లాలో ఉంది. పుల్వామాలో ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీఆర్​పీఎఫ్ కాన్వా య్ పై సూ సైడ్ బాంబ్ అటాక్​ జరగటంతో 40 మందికి పైగా జవాన్లు చనిపోయారు. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన తర్వాత కూడా అక్కడ హత్యలు సాగుతూనే ఉన్నాయి. భద్రతా ఏర్పాట్లు ప్రశ్నార్థకంగా మారాయి.

దేశంలోనే పెద్ద సెగ్మెం ట్ లడఖ్

ఏరియా పరంగా చూస్తే దేశంలోనే అతి పెద్ద లోక్​సభ ని యోజకవర్గం లడఖ్ . అక్కడ వచ్చే నెల 6న అయిదో విడతలో పోలింగ్​ జరగనుంది. 2014లో తొలిసారిగా ఈ సీటును బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. కానీ, ఇక్కడి ఎంపీ తు ప్ స్తన్ ఛెవాంగ్ నవంబర్​లో బీజేపీకి రా జీ నామా చేశారు. పోయిన ఎన్నిక ల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో పార్టీ తనకు సహకరించలేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది లడఖ్ లో కమలనాథులకు తగిలిన రెండో ఎదురుదెబ్బ. మొదటి ఎదురుదెబ్బ… 2018 అక్టోబర్​లో జరిగిన కార్గిల్ , లేహ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటునైనా గెలవకపోవటం. లేహ్లోని మొత్తం 13 స్థానాలను, కార్గిల్లోని ఆరు సీట్లను కాం గ్రెస్​ పార్టీయే కైవసం చేసుకుంది. ప్రస్తుత లోక్​సభ ఎన్నికల్లో హస్తం పార్టీ లడఖ్ లో రిజ్విన్ స్పల్ బర్​ను తన క్యాండిడేట్ గా నిలబెట్టింది. ఆయన లడఖ్ అటానమస్​ హిల్ డె వలప్ మెంట్ కౌ న్సిల్ (ఎల్ ఏహెచ్ డీసీ) కి రెండుసార్లు సీఈవోగా పనిచేశారు. ప్రస్తుత సీఈవో జయ్యంగ్​ త్సెరింగ్​ నమ్​గ్యా ల్ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.