కొమురవెల్లి, వెలుగు : జనగామ నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతూ జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిశారు.
హైదరాబాద్లోని సచివాలయంలో వారిని కలిసి ఇటీవల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులకు, రోడ్డులకు ఎస్డీఫ్ నిధులు కేటాయించాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, కార్యకర్తలు ఉన్నారు.