షర్మిల పార్టీకి పవన్ స్వాగతం 

షర్మిల పార్టీకి పవన్ స్వాగతం 

గన్నవరం: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుపై స్పందనగా పవన్ ఈ వ్యాఖ్య చేశారు. షర్మిల కొత్త పార్టీని తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. ‘ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావాల్సిన అవసరం ఉంది. ఎవరు పార్టీ పెట్టినా స్వాగతిస్తాం. అయితే అవి ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నా. నేను రాజకీయాల్లోకి కొత్తగా రాలేదు. 2007 నుంచి పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్నా. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉన్న నేల. అలాంటి నేలలో కొత్త రక్తం, చైతన్యంతో ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ వారసత్వంతో సంబంధం లేని వారు కూడా రాజకీయాల్లోకి రావాలి. అందుకే తెలంగాణలో చైతన్యం ఉన్న యువతను మా పార్టీ తరఫున గుర్తించి వారికి మద్దతిచ్చాం. ఈ రోజుల్లో పార్టీ నిర్మాణం అంతసులువు కాదు. అది వేల కోట్ల రూపాయలతో ముడిపడి ఉన్న అంశం. అయినా ఈ పరిస్థితుల్లోనూ నేను కష్టపడి పార్టీ పెట్టా. నేను పగటి కలలు కనే వ్యక్తిని కాను’ అని పవన్ పేర్కొన్నారు.