జనసేనలో చేరేందుకు ముద్రగడ అంగీకరించారు: బొలిశెట్టి శ్రీనివాస్

జనసేనలో చేరేందుకు ముద్రగడ అంగీకరించారు:  బొలిశెట్టి శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కొద్దిరోజుల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండడంతో అసంతృప్తి నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఈ  క్రమంలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరుతానంటూ ప్రకటన చేశారు. దీంతో పలు పార్టీల నేతలు ఆయనను కలిసి తమ పార్టీలోకి రావాలంటూ కోరుతున్నారు. ఇందులో జనసేన నేతలు కూడా ఉన్నారు.

-జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్..జనవరి 13వ తేదీ శనివారం కాకినాడ కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు.  ఈసందర్భంగా ఆయనతో చర్చలు జరిపి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం బొలిశెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జనసేనలో చేరడానికి ముద్రగడ అంగీకరించారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడని పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పారు. ఈ నెల 20 లేదా 23న పవన్.. ముద్రగడ దగ్గరకి వస్తారని.. ఉద్యమ నాయకుడిని తాను వచ్చే ఆహ్వానిస్తే గౌరవంగా ఉంటుందని పవన్ చెప్పారని అన్నారు.