ఈ - ఆఫీస్ లోనే ఫైళ్ల నిర్వహణ ఉండాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ఈ - ఆఫీస్ లోనే  ఫైళ్ల నిర్వహణ ఉండాలి : జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

జనగామ అర్బన్, వెలుగు : ఈ - ఆఫీస్​లోనే అన్ని ఫైళ్ల నిర్వహణ ఉండాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్​లోని డీఈవో ఆఫీస్ ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఈ సందర్భంగా ఆఫీస్​ లోని అన్ని సెక్షన్లను పరిశీలించి, సిబ్బంది పనితీరు, సెక్షన్ ల నిర్వహణ, ఫైళ్ల నిర్వహణపై ఆరా తీశారు. ఈ - ఆఫీసులోనే అన్ని ఫైళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.