ఈవీఎం, వీవీ ప్యాట్​ల తరలింపు

ఈవీఎం, వీవీ ప్యాట్​ల తరలింపు

జనగామ అర్బన్, వెలుగు: ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఈవీఎం, వీవీ ప్యాట్​లను తరలించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని ఈవీఎంల గోదాము నుంచి మూడు నియోజకవర్గాల (98,99,100) వారీగా స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచేందుకు ఈవీఎం, వీవీ ప్యాట్​ల తరలింపు ప్రక్రియను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో అడిషనల్ కలెక్టర్ పింకేశ్ కుమార్, పాలకుర్తి అడిషనల్ కలెక్టర్ రోహిత్ సింగ్ సహాయ రిటర్నింగ్ అధికారి, జనగామ ఆర్డీవో డి.కొమురయ్య సహాయ రిటర్నింగ్ అధికారి, స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో డీఎస్ వెంకన్నలతో కలిసి జిల్లా ఎలక్షన్ ఆఫీసర్, కలెక్టర్​ రిజ్వాన్ బాషా షేక్​ పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచనల మేరకు బ్యాలెట్ యూనిట్స్ 1085, కంట్రోల్ యూనిట్స్​ 1085, వీవీ ప్యాట్స్ 1216 లను మూడు నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూంలకు తరలించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్​ప్రతినిధి చెంచారపు శ్రీనివాస రెడ్డి, బీఆర్​ఎస్​రావెల రవి, బీజేపీ విజయభాస్కర్, సీపీఎం ప్రతినిధి జోగు ప్రకాశ్, సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.