జపాన్ లో తొలి ఒమిక్రాన్ కేసు.. విమాన రాకపోకలు బంద్

జపాన్ లో తొలి ఒమిక్రాన్ కేసు.. విమాన రాకపోకలు బంద్

టోక్యో: ఆఫ్రికన్ దేశాలను భయపెట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తాజాగా జపాన్ లోకి ఎంటరయ్యింది. తమ దేశంలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదయినట్లు జపాన్  ప్రకటించింది. నమీబియా నుంచి ఆదివారం టోక్యో వచ్చిన 30 ఏళ్ల వ్యక్తికి అనారోగ్య లక్షణాలు ఉండటంతో టెస్టులు చేయించారు. ఈ పరీక్షల్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలింది. దీంతో బాధితుడిని వెంటనే క్వారంటైన్ కు పంపారు. అతడు వచ్చిన విమానంలోని మిగతా ప్రయాణికులకు టెస్టులు చేసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా 10 రోజులు క్వారంటైన్ లోకి వెళ్లాలని ఆదేశించారు.  విదేశాల నుంచి వచ్చే వారిపై జపనీస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి విమానాలపై రాకపోకలను నెలపాటు నిషేధించింది.