జపాన్... డిఫరెంట్‌‌‌‌గా డబ్బింగ్

జపాన్...  డిఫరెంట్‌‌‌‌గా డబ్బింగ్

కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రాజు మురుగన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘జపాన్’. కార్తికి ఇది 25వ చిత్రం. షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ పనుల్లో ఉన్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి.  కార్తి తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్న వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది. కార్తి డబ్బింగ్ చెబుతుంటే... ఎంతకీ టేక్ ఓకే అవ్వదు. చివరికి టైటిల్ రోల్ జపాన్ గెటప్‌‌‌‌తో వచ్చి చెప్పడంతో టేక్ ఓకే అవుతుంది. 

ఈ వీడియోలో కార్తి డిఫరెంట్‌‌‌‌గా డబ్బింగ్ చెప్పడంతో పాటు తన వాయిస్, లుక్‌‌‌‌ క్యురియాసిటీని పెంచేలా ఉంది. యూనిక్ కాన్సెప్ట్‌‌‌‌తో  రూపొందుతోన్న ఈ చిత్రంలో కార్తి డిఫరెంట్ లుక్స్‌‌‌‌లో కనిపిస్తాడు. సునీల్ కీలక పాత్ర పోషిస్తుండగా, సినిమాటోగ్రాఫర్  విజయ్ మిల్టన్ ఈ చిత్రంలో నటుడిగా కనిపించనున్నారు.  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై ఎస్.ఆర్.ప్రకాష్, ఎస్.ఆర్.ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్​ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. దీపావళికి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదల కానుంది.