వందేళ్లనాటి అనుభవంతో కోలుకున్న జపాన్

వందేళ్లనాటి అనుభవంతో కోలుకున్న జపాన్

టోక్యో : స్వచ్ఛమైన గాలి, సూర్య కాంతి, నాణ్యమైన మాస్క్ లు… ఇవే  ఏ వైరస్ నైనా కట్టడి చేయగలవంటున్నారు జపనీయులు. ఈ మూడు ఆయుధాలతోనే తాము గతంలో ఇన్ప్లూయెంజాని విజయవంతంగా అదుపు చేశామన్నారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత 1918లో జపాన్ దేశాన్ని ఇన్ఫ్లూయెంజా (గాలిలోని డేంజరస్ వైరస్ శ్వాసద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి అనేక సమస్యలు సృష్టించి చివరకు ఇమ్యూనిటీని దెబ్బ తీస్తుంది)  పీడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడ విన్నా ఐసోలేషన్, క్వారంటైన్ పదాలే వినబడుతున్నాయి. జపనీయులు ఇవన్నీ తమకు తెలిసిన పాత విధానాలే అంటున్నారు. ఇన్ ఫ్లూయెంజా వైరస్ విజృంభించినప్పుడు ఐసోలాటిన్, క్వారంటైన్ పద్ధతులతోనే తమను తాము కాపాడుకున్నారు. జపాన్ లో ఫ్లూ వచ్చినప్పుడు వాళ్ళకు ఆరుబయట చికిత్స చేస్తే మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు అక్కడి పెద్దవాళ్లు. ఆస్పత్రులలో గదుల్లో ఉంచి చికిత్స చేస్తే కోలుకోవడానికి చాలా టైం పట్టిందట. ఆరుబయట బెడ్స్ వేసి, చికిత్స చేస్తే చాలా త్వరగా రికవర్ అయ్యారని జపాన్ వృద్ధులు గుర్తు చేశారు.

మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత

  • మిలిటరీ బ్యారక్స్​లో ని సైనికులు, వార్ షిప్స్ లో వుండే నావికులు గాయాలపాలయ్యారు.
  • సరైన వెంటిలేషన్ వసతులు లేకపోవడం, తక్కువ స్థలంలో ఎక్కువమంది ఉండడం ఇనఫెక్షన్ కారణాలుగా గమనించారు.
  • ఇనఫ్లూయెంజా అమెరికాలోని బోస్టన్ లో కి కూడా ప్రవేశించింది. హార్బర్​కి దగ్గరలో ఆరుబయట ఎమర్జెనీ ఆస్పత్రి ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ ఇచ్చారు.
  • ఓపెన్ ఎయిర్ కు బాక్టీరియాపై పోరాటం చేసే సత్తా ఉందని మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బయట పడింది.
  • ఇన్ఫెక్షన్ కు గురైన పుండ్లు మానాలంటే ఆరు బయట గాలే బెటర్ అని మిలిటరీ డాకర్లు నిర్ధారించారు.
  • ఈ ట్రీట్మెంట్ వలన మృతులు 40 శాతం నుండి 13 శాతానికి తగ్గించగలిగారు.
  • అప్పటి నుంచే ఓపెన్ ఎయిర్ ట్రీట్మెంట్ (శానిటోరియం) ప్రపంచవ్యాప్తమైంది.
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తే  ఆరు బయట చికిత్స చేయడం మొదలెట్టారు.
  • దీనికి కారణం ఓపెన్ ఎయిర్ లో విటమిన్-డి ఉండటమే అన్నారు బాక్టీరియాపై పోరులో విటమిన్ -డి కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

అమెరికాలో బెడ్లు సరిపోవట్లే..రోజూ వేలల్లో కరోనా కేసులు