
హైదరాబాద్, వెలుగు: ఏసీలు, ఫ్రిడ్జ్‌లు తయారు చేసే జపనీస్ కంపెనీ హైకవతో హైదరాబాద్ కంపెనీ ఎక్స్‌పర్ట్ ఏసీ సొల్యూషన్స్ చేతులు కలిపింది. సౌత్ ఇండియాలో హైకవకు సర్వీస్ ప్రొవైడర్‌గా, అఫీషియల్ పార్టనర్‌గా పనిచేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళలలో ఈ జపనీస్ కంపెనీ ప్రొడక్ట్‌లను ఎక్స్‌పర్ట్ ఏసీ సొల్యూషన్స్ అమ్ముతుంది.
రూమ్ ఎయిర్ కండిషనర్స్ (ఆర్‌ఏసీ) ను సప్లయ్ చేయడం, ఇన్‌స్టలేషన్, మెయింటైనెన్స్ వంటి సర్వీస్‌లను కంపెనీ చేపడుతుంది. గత నాలుగేళ్లలో 7 వేలకు పైగా ఏసీలను అమ్మామని కంపెనీ వెల్లడించింది. తమకు ఉన్న డీలర్ నెట్‌వర్క్‌తో హైకవ సేల్స్ పెంచుతామని ఎక్స్‌పర్ట్ ఏసీ పేరెంట్ కంపెనీ నేషనల్ ఎయిర్‌కాన్ ఎండీ సముద్దీన్ అన్నారు. ఎక్స్‌పర్ట్ ఏసీతో కలిసి సౌత్ ఇండియాలో విస్తరిస్తామని హైకవ సీఈఓ మక్బూల్ సూర్య అన్నారు.